చెలరేగిన ఢిల్లీ బౌలర్లు..కుప్పకూలిన రాజస్థాన్

ఢిల్లీ : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ సీజన్ -12లో భాగంగా శనివారం ఫెరోజ్‌ షా కోట్లా వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ తక్కువ స్కోర్ కే కుప్పకూలింది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 115 రన్స్ మాత్రమే చేసింది. రాజస్థాన్ కు మంచి ప్రారంభం దక్కలేదు. ఇశాంత్ శర్మ వేసిన 2వ ఓవర్ లాస్ట్ బాల్ కి రహానే(2) ధవన్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ కాగా.. ఆ తర్వాత మళ్లీ ఇశాంత్ వేసిన 4వ ఓవర్ ఐదో బాల్ కి లివింగ్‌స్టోన్(14) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

ఆ వెంటనే అక్షర్ పటేల్ వేసిన ఓవర్‌లో సంజూ శాంసన్(5) రనౌట్ అయ్యాడు. ఇశాంత్ వేసిన ఆరో ఓవర్ ఫస్ట్ బాల్ కి ఫోర్ కొట్టిన లామ్‌రోర్(8) ఆ తర్వాతి బాల్ కి పంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 6 ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్ 4 వికెట్ల నష్టానికి 30 రన్స్ మాత్రమే చేసి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత వచ్చిన రియాన్ పరాగ్ ఒక్కడే ఆచితూచి ఆడుతూ(30) రన్స్ చేశాడు. రాజస్థాన్ ప్లేయర్లలో పరాగ్ ఒక్కడే ఎక్కువ స్కోర్(50 హాఫ్ సెంచరీ) చేయగలిగాడు.

ఢిల్లీ బౌలర్లలో..ఇషాంత్ శర్మ, అమిత్ మిశ్రా అద్భుతమైన బౌలింగ్ తో తలో మూడు వీకెట్లు తీయగా..ట్రెంట్ బోల్ట్ కు 2 వికెట్లు దక్కాయి.

Latest Updates