రాజస్థాన్ తో మ్యాచ్ .. టాస్ గెలిచిన హైదరాబాద్

దుబాయ్‌‌: ఐపీఎల్–13లో భాగంగా గురువారం దుబాయ్ వేదికగా రాజస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచింది హైదరాబాద్. కెప్టెన్ వార్నర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఆల్‌రౌండర్‌ జేసన్‌ హోల్డర్‌ సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్నాడు. కేన్‌ విలియమ్సన్‌ స్థానంలో హోల్డర్‌ జట్టులోకి వచ్చాడు. బసిల్‌ థంపీ స్థానంలో  షాబాజ్‌ నదీమ్‌ను టీమ్‌లోకి తీసుకున్నట్లు వార్నర్‌ చెప్పాడు. స్టార్‌‌ ప్లేయర్లు రాణిస్తున్నా.. యంగ్‌‌స్టర్స్‌‌ అంతగా ఆకట్టుకోకపోవడంతో ఈ సీజన్‌‌లో తంటాలు పడుతున్న సన్‌‌రైజర్స్‌‌ హైదరాబాద్‌‌కు ఈ మ్యాచ్ మరో కఠిన సవాల్‌ ‌.

ప్లే ఆఫ్‌‌ రేసులో నిలవాలంటే విజయం అనివార్యమైన వేళ.. జరిగే మ్యాచ్‌‌లో రాజస్తాన్‌‌ రాయల్స్‌‌తో చావోరేవో తేల్చుకోనుంది. తొమ్మిది మ్యాచ్‌‌ల్లో మూడే గెలిచి ఆరింటిలో ఓడిన సన్‌‌రైజర్స్‌‌ పాయింట్స్‌‌ టేబుల్‌‌లో కింది నుంచి రెండో స్థానంలో ఉంది. ఈజీగా గెలవాల్సిన  లాస్ట్‌‌ మ్యాచ్‌‌లో కోల్‌‌కతా చేతిలో సూపర్‌‌ ఓవర్లో ఓడి డీలా పడ్డ హైదరాబాద్‌‌ ఇప్పుడు పుంజుకొని తీరాల్సిందే. ఎందుకంటే ఏడో ఓటమి ఎదురైతే  ప్లే ఆఫ్స్‌‌ గురించి మర్చిపోవాల్సి ఉంటుంది.

టీమ్స్

Latest Updates