పబ్​జీ ఆడుతూ నైన్త్ క్లాస్ స్టూడెంట్ సూసైడ్

కోటా(రాజస్థాన్): పబ్​జీ గేమ్ ఆడుతూ 14 ఏళ్ల బాలుడు సూసైడ్ చేసుకున్న ఘటన రాజస్థాన్ లోని కోటాలో జరిగింది. బాలుడు శనివారం తెల్లవారుజామున తన బెడ్​రూంలో వెంటిలేటర్ గ్రిల్​కు ఉరివేసుకున్నట్లు రైల్వే కాలనీ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ హన్స్‌రాజ్ మీనా మీడియాకు వెల్లడించారు. ‘‘9వ తరగతి చదువుతున్న ఆ బాలుడు ఆర్మీ జవాను కొడుకు. తన తల్లి ఫోన్ లోంచి పబ్​జీ గేమ్ డౌన్​లోడ్ చేసుకుని మూడ్రోజుల నుంచి కంటిన్యూగా గేమ్ ఆడాడు. శనివారం తెల్లవారుజాము 3 గంటల వరకు సోదరుడు చదువుతున్న రూమ్ లో గేమ్ ఆడి పడుకునేందుకు తన రూంలోకి వెళ్లి ఉరివేసుకున్నాడు”అని మీనా చెప్పారు. కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారని, ఈ కేసులో ఎటువంటి సూసైడ్ నోట్ కూడా లభించలేదని పోలీసులు తెలిపారు. బాలుడు కోటాలోని గాంధీ కాలనీలో తన తల్లి, సోదరుడితో కలిసి నివాసం ఉంటుండగా, తండ్రి డ్యూటీ పరంగా ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నారు.

Latest Updates