వాళ్ల పెళ్లికి వాళ్లే అతిథులు

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ఎక్కడి కార్యక్రమాలన్ని అక్కడే ఆగిపోయాయి.  అయితే అన్నింటికి అడ్డుకట్టవేస్తున్న ఈ మాయదారి మహమ్మారి పెళ్లిళ్లకు  మాత్రం అడ్డుకట్టవేయలేకపోతుంది… కరోనా రాకుంటే చాలా పెళ్లిళ్లు జరిగేవి…వాటిలో కొన్ని పెళ్లిళ్లను టెక్నాలజీని ఉపయోగించి చేసుకుంటున్నారు.

ఈ సీజన్ లో పెళ్లి చేసుకోకుండా మరోఏడాది వరకు ఎదురు చూడాల్సి ఉంది. ఏడాది పాటు వెయిట్ చేయడం ఎందుకనుకుంటున్నారో  ఏమో.. కొంతమంది నూతన వధువరులు తమపెళ్లికి తామే అతిథులుగా మారి ఒక్కటవుతున్నారు.

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లోని ఆలయంలో ఓ జంట మూడు ముళ్ల బంధంతో ఏకమైంది. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో బంధువులు లేకుండానే మాస్కులు ధరించి వివాహం చేసుకున్నారు.

ఈ సందర్భంగా వరుడు మాట్లాడుతూ తన తాతకి ఆరోగ్యం సరిలేదని, ఇప్పుడు పెళ్లి కాలేదంటే మరో ఏడాది పాటు ఎదురు చూడాల్సి వస్తుందన్నారు. అందుకే పెళ్లికి బంధుమిత్రులు, ఇరుకుటుంబాల సభ్యులు రాకపోయినా ఒక్కటైనట్లు తెలిపారు. కరోనా పట్ల జాగ్రత్తలు తీసుకుంటున్నామని, పెద్దలు లేకపోయినా సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నట్లు వధువు చెప్పింది.

Latest Updates