సన్ రైజర్స్ కు ఝలక్..రాజస్థాన్ విక్టరీ

ప్లే ఆఫ్‌‌‌‌‌‌‌‌ముగింట సన్‌‌‌‌‌‌‌‌రైజర్స్హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు మరో షాక్ . గత మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో చెన్నై చేతిలో చిత్తయిన ఆరెంజ్ఆర్మీ.. రాజస్థాన్‌‌‌‌‌‌‌‌ రాయల్స్పై పూర్తిగా తేలిపోయింది. ఫామ్ను కొనసాగించిన మనీశ్పాండే మెరుపు హాఫ్‌‌‌‌‌‌‌‌ సెంచరీతో గట్టి పునాది వేసినా తక్కువ స్కోరుకే పరిమితమైన రైజర్స్బౌలింగ్లోనూ  చేతులెత్తేసింది. మరోవైపు సొంతగడ్డపై రాయల్స్ఆల్‌‌‌‌‌‌‌‌రౌండ్షోతో అదరగొట్టింది. అద్భుత బౌలింగ్తో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ను కట్టడిచేసిన రాజస్థా న్‌‌‌‌‌‌‌‌.. రహానె, లివింగ్స్టోన్‌‌‌‌‌‌‌‌, శాంసన్‌‌‌‌‌‌‌‌క్లాస్బ్యాటింగ్తో చిన్నటార్గెట్‌‌‌‌‌‌‌‌ను ఈజీగా ఛేజ్చేసింది. వరుసగా రెండో విజయంతో నాకౌట్‌‌‌‌‌‌‌‌ అవకాశాలు మెరుగుపరుచుకుంది.

జైపూర్‌‌‌‌: కీలక సమయంలో మరో ఓటమి మూటగట్టుకున్న హైదరాబాద్‌ .. ప్లే ఆఫ్‌ అవకాశాలను సంక్షిష్టం చేసుకుంది . శనివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌ లో సన్‌ రైజర్స్‌ ఏడు వికెట్లతేడాతో రాజస్థాన్‌ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. తొలుత హైదరాబాద్‌ 20 ఓవర్లలో ఎనిమిదివికెట్లు కోల్పోయి 160 రన్స్‌ చేసింది . మనీశ్‌పాండే(36 బంతుల్లో 9 ఫోర్లుతో 61) హాఫ్‌సెంచరీ చేయగా, డేవిడ్‌ వార్నర్‌ (32 బంతుల్లో37) ఫర్వాలేదనిపించాడు. రాయల్స్‌ బౌలర్లలోవరుణ్‌ ఆరోన్‌ (2/36), ఓషెన్‌ థామస్‌ (2/28),శ్రేయస్‌ గోపాల్‌ (2/30) ఉనాద్కట్‌ (2/26)రెండేసి వికెట్లు తీశారు . అనంతరం రాజస్థాన్​19.1 ఓవర్లలో 3 వికెట్లకు 161 రన్స్‌ చేసి ఈజీగా గెలిచింది . లివింగ్‌ స్టోన్‌ (26 బంతుల్లో 4 ఫోర్లు, 3సిక్సర్లతో 44), సంజు శాంసన్‌ (32 బంతుల్లో 4ఫోర్లు, 1 సిక్సర్‌ తో 48 నాటౌట్‌ ), అజింక్య రహానె(39) రాణించారు.

రాయల్స్‌ అలవోకగా..

ఛేజింగ్‌ లో ఓపెనర్లు రహానె, లివింగ్‌ స్టోన్‌ రాయ్సల్‌ కు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు . తొలివికెట్‌ కు 49 బంతుల్లో 78 పరుగులు జోడించి విజయానికి బలమైన పునాది వేశారు . బౌండరీతోజట్టు ఖాతా తెరచిన రహానె.. భువి వేసిన మూడోఓవర్‌ లో రెండు ఫోర్లు కొట్టాడు. రషీద్‌ వేసిన నాలుగో ఓవర్‌ లో రహానె, లివింగ్‌ స్టోన్‌ చెరో సిక్స్‌కొట్టారు . సిద్దార్ధ్‌‌‌‌ కౌల్‌ వేసిన ఆరో ఓవర్లో లివింగ్‌స్టోన్‌ రెండు సిక్స్‌ లు, రెండు ఫోర్లతో రెచ్చిపోయాడు. అయితే పదో ఓవర్లో లివింగ్‌ స్టోన్‌ ను ఔట్‌ చేసి నరషీద్‌ ఈ జోడీని విడదీశాడు. కాసేపటికే షకీబల్‌ బౌలింగ్‌ లో రహానె లాంగాఫ్‌ లో వార్నర్‌ కు దొరికి పోయాడు. అప్పటికే స్కోరు వందకు చేరువవగా..కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌‌‌‌ (22), శాంసన్‌ హైదరాబాద్‌ కుఎలాంటి అవకాశం ఇవ్వకుండా టార్గె ట్‌ ను కరిగించారు. విజయానికి 18 బంతుల్లో 13 రన్స్‌ అవసరమైన దశలో ఖలీల్‌ బౌలింగ్‌ లో స్మిత్‌‌‌‌ ఔటయ్యాడు. అయితే, టర్నర్‌ (3 నాటౌట్‌ )తో కలిసిశాంసన్‌ లాంఛనం పూర్తి చేశాడు.

మనీశ్‌ ఒక్కడే

హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌ లో మనీశ్‌ ఆటే హైలైట్‌ .అద్భుత హాఫ్‌ సెంచరీతో చెలరేగిన అతను వార్నర్‌ తో కలిసి రెండో వికెట్‌ 75 రన్స్‌ జోడించి భారీ స్కోరుకు పునాది వేశాడు. కానీ, రాయల్స్‌ బౌలర్లుఅద్భుతంగా పుంజుకోవడంతో చివరి పది ఓవర్లలో 74 పరుగులే చేసిన హైదరాబాద్‌ ఏకంగా ఎనిమిది వికెట్లు కోల్పోయింది . టాస్‌ ఓడి ఫస్ట్‌‌‌‌ బ్యాటింగ్‌ కు దిగిన సన్‌ రైజర్స్‌ కు ఆరంభంలో నేషాక్‌ తగిలింది . పేలవ ఫామ్‌ ను కొనసాగించిన కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (13)… శ్రేయస్‌ గోపాల్‌  వేసిన నాలుగో ఓవర్లోనే బౌల్డ్‌‌‌‌ అయ్యాడు. మరో ఓపెనర్‌ వార్నర్‌ సింగ్సిల్స్‌ కే పరిమితమైనా..పాండే ముచ్చటైన షాట్లతో బౌండ్రీలు కొడుతూ వేగంగా పరుగులు రాబట్టాడు. గోపాల్‌ వేసినఎనిమిదో ఓవర్‌ లో రెండు ఫోర్లు కొట్టిన మనీశ్‌ ,రియాన్‌ వేసిన తర్వాతి ఓవర్‌ లో మరో రెండు ఫోర్లుకొట్టా డు. అదే జోరుతో 27 బంతుల్లో హాఫ్‌ సెంచరీపూర్తి చేశాడు. అయితే థామస్‌ వేసిన 13వఓవర్లో స్మిత్‌‌‌‌ పట్టిన చురుకైన క్యాచ్‌ కు వార్నర్‌ వెనుదిరిగాడు. అక్కడి నుంచి రైజర్స్‌ ఇన్నింగ్స్‌ స్వరూపమే మారిపోయింది . హైదరాబాద్‌ ఆటగాళ్లు పేలవ షాట్లతో వికెట్లు పారేసుకున్నారు .శ్రేయస్‌ బౌలింగ్‌ లో క్రీజు ముందుకొచ్చి ఆడే ప్రయత్నంలో మనీశ్‌ స్టంపౌటయ్యాడు. ఆ వెంటనేవిజయ్‌ శంకర్‌ (8) ను వరుణ్‌ ను ఔట్‌ చేయగా..ఉనాద్కట్‌ బౌలింగ్‌ లో దీపక్‌ హుడా(0) ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. ఈ సీజన్‌ లో తొలిసా రిబరిలోకి దిగిన వృద్ధిమాన్‌ సాహా (5), షకీబల్‌హసన్‌ (9) కూడా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. వరుణ్‌ వేసిన లాస్ట్‌‌‌‌ ఓవర్లో భువనేశ్వర్(1) కూడా ఔటైనా.. ఆఖరి రెండు బంతులను రషీద్‌(17 నాటౌట్‌ ) ఫోర్‌ , సిక్సర్‌ గా మలచడంతో రైజర్స్‌ ఆ మాత్రం స్కోరు చేసింది .

సన్ రైజర్స్​ : వార్నర్‌ (సి) స్మిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (బి) థామస్‌ 37, విలియమ్సన్‌ (బి) గోపాల్‌ 13, మనీశ్‌ పాండే (స్టంప్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)శాంసన్‌ (బి) గోపాల్‌ 61, శంకర్‌ (సి) ఉనాద్కట్‌ (బి) ఆరోన్‌ 8, షకీబల్‌ (సి) గోపాల్‌ (బి) ఉనాద్కట్‌9, హుడా(సి అండ్‌ బి) ఉనా ద్కట్‌ 0, సా హా(సి) శాంసన్‌ (బి) థామస్‌ 5, రషీద్‌ (నా టౌట్‌ ) 17,భువనేశ్వర్‌ (సి) ఉనాద్కట్‌ (బి) ఆరోన్‌ 1, కౌల్‌ (నాటౌట్‌ ) 0 ; ఎక్స్‌ ట్రాలు :9 ; మొత్తం : 20 ఓవ-ర్లలో 160/8

రాజస్థాన్‌‌‌‌ రాయల్స్‌ : రహానె (సి) వార్నర్‌ (బి) షకీబల్‌ 39, లివిం గ్‌ స్టోన్‌ (సి) సాహా (బి) రషీద్‌44, శాంసన్‌ (నాటౌట్‌ ) 48, స్మిత్‌‌‌‌ (సి) కౌల్‌ (బి) ఖలీల్‌ 22, టర్నర్‌ (నాటౌట్‌ ) 3 ; ఎక్స్‌ ట్రాలు : 5;మొత్తం : 19.1ఓవర్లలో 161/3

Latest Updates