రాజీవ్ స్వగృహ ఇళ్ల బిల్లుల చెల్లింపులో భారీ అవినీతి

రాష్ట్రంలో రాజీవ్ స్వగృహ ఇళ్ల బిల్లుల చెల్లింపులో భారీ అవినీతి  జరిగిందన్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. పూణేకు చెందిన ఓ కంపెనీకి బిల్లులు చెల్లించేందుకు మంత్రి కేటీఆర్ 50 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారని ఆరోపించారు.

ఆ కంపెనీతో ఎంపీ సంతోష్ ఢిల్లీలో చర్చలు జరిపారన్నారు రేవంత్. దీనిపై సీబీఐ విచారణ కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. కేంద్రం స్పందించకుంటే కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు.

Latest Updates