2025 నాటికి భారత్ నుంచి టీబీని తరిమేద్దాం: ఈటల

ఏటా రాష్ట్రంలో 12 వేల మంది టీబీతో చనిపోతున్నారన్నారు మంత్రి  ఈటల రాజేందర్. మందులు, వ్యాక్సిన్ లు అందుబాటులో ఉన్నా.. జనంలో అవగాహన లేదన్నారు. కామినేని అకాడమీ ఆఫ్  మెడికల్  సైన్స్  అండ్  రీసెర్చ్  సెంటర్ లో ఏర్పాటు చేసిన టీబీ అవగాహనా కార్యక్రమంలో పాల్గొన్నారు. 2025 నాటికి భారత్  నుంచి టీబీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. మొబైల్  వ్యాన్ లో ల్యాబ్ లను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు ఈటల. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్ర మంత్రి అశ్వినికుమార్  చౌబే హాజరయ్యారు.

Latest Updates