కమల్‌కు మద్దతుగా రజినీకాంత్..!

తమిళనాడులో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ నాయకులు ప్రచారాన్ని స్పీడప్ చేస్తున్నారు. అయితే తాజాగా కమల్‌ పార్టీకి రజినీకాంత్ మద్దతు పలికినట్లు కమలే స్వయంగా ఈ విషయం స్పష్టం చేశారు. గతంలో ఒకసారి రజినీని కలిసినపుడు కమల్‌ మద్దతు కోరినట్లు అందుకు రజనీ సరేనన్నారని కమల్‌ తెలిపారు. దీంతో రేపటి రోజు తమదే నన్న విశ్వాసాన్ని రజినీకాంత్ వ్యక్తం చేశారని కమల్‌ చెప్పారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కమల్‌ హాసన్‌ పార్టీ మక్కల్‌ నీది మయ్యం పోటీ చేస్తోంది. కమల్‌ ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. కాని పార్టీ మాత్రం 39 లోక్‌సభ స్థానాల్లో, 18 అసెంబ్లీ స్థానాల్లో బరిలో నిలిచింది.

కమల్‌ పార్టీ మాత్రం తృణమూల్‌తో కలిసి పనిచేస్తోంది. గత నెల 25న కోల్‌ కతా పర్యటనలో భాగంగా సీఎం మమతాతో భేటీ అయిన కమల్‌ ఈ విషయమై చర్చించి, తన నిర్ణయాన్ని ప్రకటించారు. అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో టీఎంసీ తరఫున ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్‌ ఆరున జరిగే ప్రచారంలో పాల్గొంటానన్నారు.

Latest Updates