ఆ లేఖలో నా ఆరోగ్యంపై ఉన్నది నిజమే: రజనీకాంత్

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని… ఆయన ఆరోగ్య పరిస్థితి రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నారని ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై  స్పందించిన రజనీకాంత్ … ఆ లేఖ తనది కాదని, కానీ అందులో తన ఆరోగ్యం గురించి ఉన్న సమాచారం నిజమేనని స్పష్టం చేశారు. త్వరలోనే రజనీ మక్కల్ మండ్రం (RMM) సభ్యులతో చర్చించిన తర్వాత ఓ అధికారిక ప్రకటన ఉంటుందని రజనీ తెలిపారు.

రజనీ పేరిట వచ్చిన లేఖలో ఆయన ఆరోగ్య పరిస్థితి గురించిన సమాచారం ఉంది. 2011లో రజనీకాంత్ కిడ్నీ వ్యాధి బారినపడడంతో సింగపూర్ లో ట్రీట్మెంట్ చేయించుకున్నారని, 2016లో కిడ్నీ సమస్య తిరగబెట్టడంతో ఈసారి అమెరికా వెళ్లి చికిత్స తీసుకున్నారని అందులో వివరించారు. అంతేకాదు, ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్నందున కిడ్నీ వ్యాధిగ్రస్తుడైన రజనీకాంత్ ఏమాత్రం బయట తిరగలేని పరిస్థితి ఉంది. ఒకవేళ వ్యాక్సిన్ వచ్చినా కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి రీత్యా బయట తిరగడం సాధ్యం కాకపోవచ్చని ఆ లేఖలో ఉంది.

Latest Updates