కోపంతో రగిలిపోతున్న రజినీకాంత్

చాలాకాలం తర్వాత రజనీకాంత్ పోలీసు యూనిఫామ్ వేశారు. ఆయన పక్కన నయనతార హీరోయిన్‌‌గా చేస్తోంది. మురుగదాస్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. బాలీవుడ్ యాక్టర్స్ నెగిటివ్ రోల్స్​లో కనిపించనున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఒక్కటి కాదు… చెప్పుకోవాలే కానీ ప్రేక్షకుల అంచనాలను పెంచేసే విశేషాలు చాలానే ఉన్నాయి ‘దర్బార్​’ విషయంలో. దానికి తోడు యూనిఫామ్​లో రజనీ యాంగ్రీ ఫస్ట్ లుక్‌‌ని చూశాక ఆ అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇప్పుడాయన సెకెండ్ లుక్ రిలీజయ్యింది. ఇది మొదటిదాన్ని మించి ఉంది. లుక్స్‌‌తోనే రజనీ, మురుగదాస్‌‌లో ఇంతగా మెప్పిస్తున్నారంటే.. థియేటర్‌‌‌‌లో ఇంకెంత ఎంటర్‌‌‌‌టైన్​ చేస్తారో!

Latest Updates