అభిమానులకు మళ్లీ నిరాశే.. పొలిటికల్ ఎంట్రీపై సూపర్‌‌స్టార్ పాతపాట

చెన్నై: రాజకీయంగా మరింత ముందుకెళ్లడంపై క్లారిటీ ఇస్తాడనుకున్న సౌత్ సూపర్‌‌స్టార్ రజినీకాంత్ మరోసారి నిరాశపర్చాడు. తళైవా ఎప్పుడు రాజకీయాల్లోకి పూర్తిగా వస్తాడా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌‌ను డిజప్పాయింట్ చేశాడు. పొలిటికల్ ఎంట్రీపై నిర్ణయాన్ని పోస్ట్‌‌పోన్ చేశాడు. సోమవారం రజినీ మక్కల్ మండ్రమ్ ఆఫీస్ బేరర్ల సమావేశం తర్వాత ఆయన తన నిర్ణయాన్ని వెలువరించారు.

‘నేను ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు సమ్మతమేనని జిల్లా సెక్రెటరీలు నాకు చెప్పారు. దీనిపై త్వరలో నా నిర్ణయాన్ని చెబుతా’ అని రజినీ పేర్కొన్నారు. రీసెంట్‌‌‌గా అనారోగ్యం బారిన పడిన రజినీని ప్రస్తుత ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా రాజకీయాలకు దూరంగా ఉండాలంటూ వైద్యులు సూచించారని సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయాల్లోకి రావడం లేదంటూ ఓ లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. వీటిపై రజినీ స్పష్టతను ఇచ్చారు. ‘నెట్‌‌లో సర్కులేట్ అవుతున్న లీకైన లెటర్‌‌తో నాకు సంబంధం లేదు. నా ఆరోగ్యం గురించి డాక్టర్లు ఇచ్చిన సలహాలు, సూచనలు మాత్రం నిజం. ఇక నా రాజకీయ వైఖరి విషయానికొస్తే.. ఈ విషయం గురించి రజినీ మక్కల్ మండ్రంలో చర్చించి, సరైన సమయంలో నిర్ణయాన్ని వెల్లడిస్తా’ అని రజినీకాంత్ ట్విట్టర్‌‌లో పేర్కొన్నారు.

Latest Updates