‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ షో లో సూపర్ స్టార్

సూపర్ స్టార్ రజనీకాంత్  డిస్కవరీ ఛానెల్‌లో ప్రసారమయ్యే మ్యాన్ వర్సెస్ వైల్డ్ అనే టెలివిజన్ షో లో పార్టిసిపెట్ చేయనున్నారు. పర్యావరణ సంరక్షణ అనే కాన్సెప్ట్‌తో  నడిచే ఈ షోని బేర్ గ్రిల్స్‌ హోస్ట్ చేస్తుంటాడు. గ్రిల్స్ తో కలిసి త్వరలో ఈ షో లో కనిపించనున్నాడు రజనీ. కర్ణాటకలోని బండిపూర్ టైగర్ రిజర్వ్ అండ్ నేషనల్ పార్క్ లో ఈ షో కి సంబంధించి షూటింగ్ జరుగుతుంది. మొత్తం నాలుగు వేర్వేరు ప్రదేశాల్లో మూడు రోజుల పాటు షూట్ కొనసాగుతుంది. జనవరి 28 నుంచి 30 వరకు జరిగే ఈ షూటింగ్  ఎపిసోడ్ ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందనేది ఇంకా తెలియరాలేదు.

ఇటీవల ప్రధాని మోడీ కూడా బేర్‌ గ్రిల్స్‌తో కలిసి ఈ షోలో పాల్గొన్నారు. ప్రధాని, గ్రిల్స్.. ఉత్తరాఖండ్‌లోని జిమ్‌కార్బెట్ నేషనల్ పార్క్‌లో ఈ షో చేశారు. దాదాపు 180 దేశాల్లో మోదీ ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది. తాజాగా రజనీకాంత్ కూడా గ్రిల్స్‌తో ఈ సాహసయాత్రలో భాగం కానున్నారు.

Latest Updates