రజనీకాంత్‌ కు ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ అవార్డు

తమిళ సినీ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కి అరుదైన గౌరవం దక్కింది. 50వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(IFFI) 2019 వేడుకలో ఆయన్ను ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ అవార్డుతో సత్కరించనున్నారు. ఈ విషయాన్నికేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాష్ జవదేవకర్ ట్విట్టర్ ద్వారా  శనివారం అధికారికంగా ప్రకటించారు. గత కొన్ని దశాబ్దాలుగా భారతీయ సినిమాకు ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ అవార్డును ప్రకటించడం చాలా సంతోషంగా ఉందన్నారు.

ప్రతిష్టాత్మక గౌరవానికి ఎంపిక చేసినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపారు రజనీకాంత్. నవంబర్ 20 నుండి 28 వరకు గోవాలో గోల్డెన్ జూబ్లీ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అవార్డుల కార్యక్రమం జరగనుంది.

Latest Updates