సారీ చెప్పను : పెరియార్​పై కామెంట్స్​కు రజనీకాంత్​

చెన్నై:  సంఘ సంస్కర్త పెరియార్ ఈవీ రామస్వామి ఆధ్వర్యంలో జరిగిన  ఊరేగింపుపై తాను చేసిన కామెంట్స్​కు కట్టుబడి ఉంటానని సూపర్​స్టార్​ రజనీకాంత్​ చెప్పారు. దీనిపై తాను బాధపడనని, సారీ చెప్పనని  స్పష్టంచేశారు.  తాను చేసిన కామెంట్స్​లో ఎలాంటి అబద్ధంలేదని  పోయెస్​ గార్డెన్​లోని తన ఇంట్లో మంగళవారం  ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో రజనీ వివరించారు. సీతారాముడి విగ్రహాలను అభ్యంతరకరమైన రీతిలో పెరియార్​ 1971లో   ఊరేగించినట్టుగా చెబుతున్న మేగజైన్​, న్యూస్​పేపర్ల క్లిప్పింగ్​లను  రజనీ​ మీడియాకు చూపించారు.  విన్నదీ, మేగజైన్లలో ప్రచురించింది మాత్రమే చెప్పానని ఆయన అన్నారు. దీనికి తాను సారీ చెప్పనని తెలిపారు. “ఊహించి నేనేమీ చెప్పలేదు.  లేనిదీ కూడా చెప్పలేదు.

పెరియార్​ ఊరేగింపులో పాల్గొన్న లక్ష్మణన్​ ( అప్పట్లో జనసంఘ్​, ఇప్పుడు బీజేపీ నాయకుడు) కూడా దీన్ని కన్ఫర్మ్​ చేశారు ”అని రజనీ వివరించారు. “అది సులువుగా మర్చిపోయేటంత  అంశంకాదు. అయితే అది కచ్చితంగా మర్చిపోవాల్సిన ఇష్యూ ”అని రజనీ చెప్పారు. ఈ నెల 14న తమిళ మేగజైన్​ తుగ్లక్​  ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్న రజనీకాంత్​ పెరియార్ ఊరేగింపు అంశాన్ని ప్రస్తావించారు. ​అభ్యంతరకరంగా ఉన్న సీతారామచంద్రమూర్తి, సీతాదేవి విగ్రహాలను సేలంలో పెరియార్​ ఆధ్వర్యంలో 1971లో ఊరేగించినట్టు  రజనీ చెప్పడం వివాదంగా మారింది.  అబద్ధాలు చెప్పిన సూపర్​స్టార్​ సారీ చెప్పాలని  ద్రవిడార్‌‌‌‌ విదుతులై కజగం డిమాండ్​ చేసింది.  ఆయనపై చర్య తీసుకోవాలని పోలిస్​ స్టేషన్​లో కేసు పెట్టింది. పెరియార్ గురించి మాట్లాడే ముందు ఆలోచించుకోవాలని రజనీకి డీఎంకే చీఫ్ స్టాలిన్ సలహా ఇచ్చారు.

SEE ALSO:RTA యాప్ : సెల్ఫీ అప్​లోడ్​తో బండి రిజిస్టర్​ 

Latest Updates