ఘనంగా రజనీకాంత్ రెండో కుమార్తె వివాహం

సూపర్ స్టార్ రజనీకాంత్ రెండో కుమార్తె సౌందర్య వివాహం నటుడు, వ్యాపారవేత్త విశాగన్‌తో ఇవాళ (సోమవారం) ఘనంగా జరిగింది. మొదటి భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత… సౌందర్య ప్రేమించి పెద్దల సమ్మతితో విశాగన్‌ను వివాహం చేసుకుంది. చెన్నైలోని లీలా ప్యాలెస్ లో జరిగిన వివాహంలో రాష్ట్ర సీఎం పళణిసామి, డిప్యూటి సీఎం పన్నీరు సెల్వంతోపాటు పలువురు మంత్రులు…వివిధ పార్టీల నేతలు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వీరితో పాటు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు హాజరై అభినందనలు తెలిపారు.

Latest Updates