మేము చనిపోతాం అనుమతివ్వండి : మోడీకి రాజీవ్ హంతకుల లేఖ

జైల్లో ఫోన్ వాడిన నళిని దంపతులు… 
వేరే సెల్ లో ఉంచినందుకు నిరహారదీక్ష…
కారుణ్య మరణం కోసం ప్రధానికి, కోర్టుకు లేఖ…

కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలంటూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులుగా శిక్ష అనుభవిస్తున్న నళినీ శ్రీహరన్, ఆమె భర్త మురుగన్. నవంబర్ 27న ప్రధాని నరేంద్ర మోడీతో పాటు, మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్ అమరేశ్వర్ ప్రతాప్‌కి నళిని లేఖ రాశారు. తీవ్రమైన ఒత్తిడి కారణంగానే నళిని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె తరపు లాయర్ పుగజెంది తెలిపారు. తాము విడుదల అవుతామని గత 26సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నామని.. ఇప్పుడు ఆ ఆశలన్నీ ఆవిరవుతున్నాయని నళినీ లెటర్ లో తెలిపారు. తన భర్త మురుగన్‌ను జైలు అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. భరించటం తమ వల్ల కావడం లేదని అందుకే కారుణ్యమరణానికి అనుమతించాలని నళిని కోరారు.

కొన్నిరోజుల క్రితం మురుగన్ వద్ద సెల్ ఫోన్ దొరకడంతో జైలు అధికారులు అతన్ని ఒంటరిగా వేరే సెల్ లో ఉంచారు. ఇందుకు నిరసనగా గత పది రోజులుగా నళిని, మురుగన్ లు నిరహార దీక్ష చేస్తున్నారు. గతంలో…  వెల్లూరు జైలు నుంచి పుఘుల్ జైలుకు తరలించాలంటూ నళిని తమిళనాడు ప్రభుత్వానికి వినతి పత్రం పంపింది. రాజీవ్ గాంధీ హత్యలో శిక్ష అనుభవిస్తున్న ఏడుగురిని విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్ భన్వరీలాల్ పెండింగ్ లో ఉంచారు.

Latest Updates