హోలీ వేడుకలకు దూరం : రాజ్ నాథ్ నిర్ణయం

ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రదాడిలో 41 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులు కావడంతో పండుగలకు దూరంగా ఉండాలని కొందరు కేంద్రమంత్రులు నిర్ణయం తీసుకున్నారు. దేశమంతటా పలు రాష్ట్రాల్లో బుధవారం, గురువారం రెండురోజుల పాటు జరగనున్న హోలీ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని నిర్ణయించారు.

కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈసారి హోలీ వేడుకల్లో పాల్గొనబోనని చెప్పారు. పుల్వామా ఉగ్రదాడి ఘటన తనను కలచివేసిందనీ.. ఆ బాధనుంచి ఇంకా తేరుకోలేదని ఆయన అన్నారు. రంగుల సంబురమైన హోలీ వేడుకలకు దూరంగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారు.

అమరులైన  జవాన్ల కుటుంబాలు ఇంకా బాధలోనే ఉన్నాయని… వారిని బాధను పంచుకుంటామని దేశంలోని పలు రాష్ట్రాల పార్టీలు ఇప్పటికే ప్రకటించాయి. బిహార్ లోని రాష్ట్రీయ జనతాదళ్ ఈసారి హోలీ వేడుకలకు దూరంగా ఉంటోంది.

Latest Updates