
ఆన్లైన్లో CSD క్యాంటీన్ల ద్వారా అమ్మే పోర్టల్‌ను ఇవాళ(శుక్రవారం) రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. దీంతో వాషింగ్ మెషీన్లు, మైక్రోవేవ్ ఓవెన్లు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, టెలివిజన్, ల్యాప్‌టాప్‌లతో సహా ఖరీదైన వస్తువులను కొనుగోలు చేయవచ్చన్నారు. పోర్టల్ 45 లక్షల CSD లబ్దిదారులకు వారి ఇంటి సౌలభ్యం నుంచి AFDI-I వస్తువులను కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుందన్నారు. సాయుధ దళాల సిబ్బంది, మాజీ సైనికులు CSD క్యాంటీన్లను ఉపయోగిస్తున్నారు. అందరు జవాన్లు, సాయుధ దళాల అధికారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు మంత్రి రాజ్‌నాథ్.