బీజేపీ తోనే అభివృద్ధి.. మహబూబాబాద్ సభలో రాజ్ నాథ్

మహబూబాబాద్ లో జరిగిన బీజేపీ విజయ సంకల్ప్ సభలో కేంధ్ర హోం శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకులు రాజ్ నాథ్ సింగ్ మాట్లాడారు. అందరికీ నమస్కారం అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. మహబూబాబాద్ లోక్ సభ స్థానం నుంచి  బీజేపీ అభ్యర్తిగా హుసేన్ నాయక్  బరిలో ఉన్నారని తెలిపారు. హుసేన్ ఎంతో విజ్ఞత కలిగిన వ్వక్తి అని రాజ్ నాథ్ అన్నారు.  హుసేన్ ను గెలిపించి లోక్ సభకు పంపే బాధ్యత మీపై ఉందని స్థానిక ప్రజలను ఉద్ధేశించి ఆయన అన్నారు. ప్రధాని మోడీ హయాంలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని రాజ్ నాథ్ అన్నారు. మోడీ చేసిన అభివృద్ధి కారణంగా.. అంతర్జాతీయ ద్రవ్యనిది లెక్కల ప్రకారం 2028 లో ప్రపంచంలో 3 వ పెద్ద దేశంగా భారత్ అవతరిస్తుందని అన్నారు.

కాంగ్రెస్ అధికారంలో ఉన్న(2004 – 2014) 10 సంవత్సరాలలో 25 లక్షల ఇల్లు నిర్మిస్తే, మోడీ ప్రభుత్వం హయాంలో 1కోటి 20 లక్షల ఇల్లు నిర్మించామని రాజ్ నాథ్ తెలిపారు. మోడీ ప్రభుత్వం గ్యాస్ లేని ప్రతి పేద వారికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చింది.  ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి పధకం ద్వారా 5 ఎకరాలు లోపు ఉన్న ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి 6000 రూపాయలు అందించాం. దేశంలోని ప్రతి గ్రామానికి రోడ్డు నిర్మాణం జరుగుతుంది. 1,16 వేల గ్రామాలకు ఇంటర్నెట్ సేవలు అందించాం అని రాజ్ నాథ్ తెలిపారు.

అటల్ జీ, మోడీ ప్రభుత్వం లో ఎలాంటి కుంభకోనాలు జరగలేదు …అది బీజేపీ ప్రభుత్వం పనితీరు అని రాజ్ నాథ్ అన్నారు.  మోడీ సర్కారు రాక ముందు 18 వేల గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం లేదని.. ఆ గ్రామాలకు విద్యుత్ ను అందించామని చెప్పారు. మోడీ ప్రభుత్వంలో దేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. 2014 కు ముందు కేవలం రెండు కంపెనీలు భారతదేశం లో ఊపాది కల్పించాయి… ఎన్డీఏ ప్రభుత్వంలో.. మేకిన్ ఇండియాలో భాగంగా 120 కంపెనీలు దేశంలోకి వచ్చి జాబ్ లు క్రియేట్ చేసాయి. ప్రస్తుతం ఐరన్ ఉత్పత్తి లో భారత దేశం అగ్రస్థానం లో ఉంది. రక్షణ రంగంలో మోడీ ఆధ్వర్యంలో అత్యంత శక్తి వంతంగా తయారైందని అన్నారు. మోడీ ప్రభుత్వం హయాంలో అంతరిక్షం లో కూడా భారత్ దేశం  ఉన్నత స్థాయికి చేరిందని అన్నారు రాజ్ నాథ్ సింగ్.

Latest Updates