ఈ కన్యను తాకాలని చూస్తే మరణం తప్పదు

హైదరాబాద్ : ఓంకార్ డైరెక్షన్ లో అశ్విన్ బాబు హీరోగా తెరకెక్కిన సినిమా రాజుగారి గది. అవికాగోర్ లీడ్ రోల్ లో నటించిన ఈ మూవీ ఫస్ట్ లుక్ ఇటీవల రిలీజైన విషయం తెలిసిందే. దసరాకు రానున్న ఈ సినిమా ప్రమోషన్స్  స్పీడ్ పెంచింది యూనిట్. ఈ క్రమంలోనే రాజుగారి గది సినిమా ట్రైలర్ ను ఆదివారం హీరో విక్టరీ వెంకటేష్ చేతులమీదుగా రిలీజ్ చేశారు. ట్రైలర్ లోని సీన్స్ సినిమాపై ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. అశ్విన్‌, అవికాగోర్ ప‌ర్‌ ఫార్మెన్స్‌ బాగుంది. ‘ఈ కన్యను తాకాలని చూస్తే నీకు తప్పదు మరణం’ అని అశ్విన్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది.

‘రాజుగారి గది, రాజుగారి గది 2’ సినిమాలతో డైరెక్టర్ గా మంచి విజ‌యాన్ని అందుకున్న ఓంకార్ ..ఈ మూవీ కూడా హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న రాజుగారి గది-3..డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుందని తెలిపింది యూనిట్.

Latest Updates