రాజ్యసభ ఎంపీ అమర్‌‌సింగ్‌ ఇకలేరు

న్యూఢిల్లీ: సమాజ్‌వాదీపార్టీ మాజీ నేత, రాజ్యసభ ఎంపీ అమర్‌‌సింగ్‌ ఇకలేరు. సింగపూర్‌‌లోని ఓ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటూ ఆయన చనిపోయారు. 64 ఏళ్ల అమర్‌‌సింగ్‌ గతంలో మూత్ర పిండాల మార్పిడి చేయించుకున్నారు. కాగా.. గత ఆరు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఐసీయూలో ఉండి ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. ఆయన కుటుంబసభ్యులు కూడా సింగపూర్‌‌లోనే ఉన్నారని సమాచారం. 2008లో యూపీఏ ప్రభుత్వానికి వామపక్షాలు తమ మద్దతు ఉపసంహరించుకున్న సమయంలో సమాజ్‌వాదీ పార్టీ మద్దతు విషయంలో అమర్‌‌సింగ్‌ కీలక పాత్ర పోషించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో 2010లో అమర్‌‌సింగ్‌, సినీనటి జయప్రదను పార్టీ నుంచి బహిష్కరించారు.

Latest Updates