పెండ్లైన ఐదేండ్ల తర్వాతే సరోగసికి అనుమతించండి

రాజ్యసభ సెలెక్ట్ కమిటీకి వైద్యారోగ్యశాఖ సూచన

హైదరాబాద్, వెలుగు: పెండ్లైన ఐదేండ్ల తర్వాతే సరోగసి ద్వారా పిల్లలను కనేందుకు అనుమతివ్వాలని రాజ్యసభ సెలెక్ట్ కమిటీకి రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సూచించింది. ఈ మేరకు సరోగసి రెగ్యులేషన్ బిల్లులో మార్పులు చేయాలని కోరినట్టు తెలిసింది. ఎంపీ భూపేందర్ యాదవ్‌‌ నేతృత్వంలోని కమిటీ గురువారం హైదరాబాద్‌‌లో పర్యటించింది. ఇక్కడి ఓ హోటల్‌‌లో ఏపీ, తెలంగాణ అధికారులతో సమావేశం నిర్వహించింది. సరోగసి అమలు, నియంత్రణకు అనుసరించాల్సిన విధానాలు తదితర అంశాలపై ఆఫీసర్ల అభిప్రాయాలు సేకరించింది. సరోగసీ తల్లులకు నష్టపరిహారం ఎంతివ్వాలన్న దానిపై బిల్లులో ఉన్న దాన్నే స్టేట్ ఆఫీసర్లు  సమర్థించినట్లు తెలిసింది. వ్యాపారాత్మకంగా సరోగసీ ఉండకూడదని, బిల్లులో దాన్ని నిషేధించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమర్థించినట్లు తెలిసింది. సరోగసీ నిబంధనలను ఉల్లంఘించే వారికి కఠిన శిక్షలు ఉండాలని సూచించినట్లు సమాచారం.

 

Rajya Sabha members seek changes in surrogacy bill over age, eligibility, 5 years marriage norms

Latest Updates