ముగిసిన రాజ్యసభ నామినేషన్ల గడువు

రాజ్యసభ నామినేషన్ లకు శుక్రవారంతో గడువు ముగిసింది. ఈ నెల 16 న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. మార్చి 18 సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు టిఆర్ఎస్ అభ్యర్థుల ఏకగ్రీవాన్ని ప్రకటించనున్నారు ఎన్నికల అధికారి.

తెలంగాణ రాష్ట్రం నుండి రెండు స్థానాలకు గాను మొత్తం నాలుగు నామినేషన్ లు దాఖలు అయ్యాయి. అందులో రెండు టీఆర్ఎస్ కి చెందిన నేతలు కే.కేశవరావు, కే.ఆర్.సురేష్ రెడ్డి లు వేశారు. మరో రెండు నామినేషన్లు శ్రమజీవి పార్టీ నుంచి దాఖలయ్యాయి.  రాజ్యసభ సభ్యుడు గెలవడానికి ఒక పార్టీ నుంచి 41 ఎమ్మెల్యేలు కావాలి.. అయితే ఆ అవకాశం లేనందున శ్రమజీవి పార్టీ అభ్యర్థుల నామినేషన్లు రిజెక్ట్ కానున్నాయి.

Rajya sabha nomination process completed

Latest Updates