కరీంనగర్ సిటీలోని విద్యాసంస్థల్లో ఘనంగా రాఖీ వేడుకలు

కరీంనగర్ సిటీలోని విద్యాసంస్థల్లో ఘనంగా రాఖీ వేడుకలు

కరీంనగర్ టౌన్/కొత్తపల్లి, వెలుగు: సిటీలోని పలు విద్యాసంస్థల్లో శుక్రవారం ముందస్తు రాఖీ  వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయా స్కూళ్లలో విద్యార్థులు టీచర్లకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు కరస్పాండెంట్లు, చైర్మన్లు మాట్లాడుతూ రాఖీ పండుగ అన్నా చెల్లెలు, అక్కా తమ్ముళ్ల ప్రేమకు ప్రతీక అని కొనియాడారు. 

చెట్టుకు రాఖీలు.. 

జ్యోతినగర్​, వెలుగు: రామగుండం మండలం ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో ప్రకృతి ప్రేమికులు వృక్షాబంధన్ నిర్వహించారు. శ్రీ సీతారామ సేవా సమితి అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ ఆధ్వర్యంలో చెట్లకు రాఖీలు కట్టి చెట్ల పరిరక్షించాలన్నారు. కార్యక్రమంలో కంది సుజాత, బిల్లా శ్రీదేవి, కొండు రమాదేవి, కటుకూరి శాంతి, స్వప్న, విజయ, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.