బెల్లంకొండ చెప్పిన రాక్షసుడు వసూళ్ల సంగతులు

ఎంతో కాలంగా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌‌కి, ‘రాక్షసుడు’ రూపంలో హిట్ దక్కింది. రమేష్‌‌ వర్మ డైరెక్షన్‌‌లో కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రం విజయవంతంగా రన్ అవుతూ ఉండటంతో ఆ ఆనందాన్ని పంచుకోవటానికి సమావేశం నిర్వహించారు.

బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ ‘బడ్జెట్ రూ.22 కోట్లు. ఆంధ్ర, సీడెడ్, నైజాం థియేట్రికల్ రైట్స్ రూ.12 కోట్లకు అమ్ముడు కాగా.. హిందీ శాటిలైట్ రూ.12 కోట్లు, తెలుగు శాటిలైట్ రైట్స్‌‌కి రూ.5.90 కోట్లు అయ్యాయి. మొత్తంగా రూ.30 కోట్లకు ఈ సినిమాను అమ్మాం. థియేట్రికల్ రైట్స్‌‌కు పెట్టిన పన్నెండు కోట్లు నిన్నటికే వచ్చాయి. వైజాగ్, ఈస్ట్ హక్కుల్ని నేనే కొన్నాను. వైజాగ్ ఏరియాలో నిన్నటికే రూ.2 కోట్లు వచ్చాయి. సినిమా లాభంతోనే స్టార్టయ్యింది. వర్షం లేకుంటే కలెక్షన్స్ సునామీ సృష్టించేది. ఈ నెల15 తర్వాత టూర్ ప్లాన్ చేస్తాం. నేను మా అబ్బాయితో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాను కానీ.. ‘అల్లుడు శీను’ని మించి ఉండాలని ఆశపడుతున్నా. స్క్రిప్ట్ కుదిరితే చేస్తాను. రవీందర్‌‌‌‌రెడ్డితో ‘జయ జానకి నాయక’ చేశాను. మంచి కథ దొరకగానే ఆయనతో మరో సినిమా చేస్తాను. అభిషేక్‌‌తో కూడా ‘సాక్ష్యం’ చేశా. కవచం, సీతలాంటి సినిమాను కొని లాస్ అయినా మళ్లీ వాళ్లతో మా అబ్బాయి సినిమా చేసేలా చూస్తాను. సాయిని స్టార్ హీరోని చేయాలనే పెద్ద సినిమాలు చేసుకుంటూ వచ్చాను. ఓ మార్కెట్ క్రియేటయ్యింది కాబట్టి ఇప్పుడు కాస్త గ్యాప్ తీసుకున్నా ఫరవాలేదు. మరో మంచి కథను చూసుకుని ప్లానింగ్‌‌తో సినిమా చేస్తాం’ అని చెప్పారు. సాయి

శ్రీనివాస్ మాట్లాడుతూ ‘ఇది మర్చిపోలేని సక్సెస్. పదవ రోజుకే డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ సేఫ్ అయ్యారు. సంతోషంగా ఉంది. తమిళ సినిమాను రీమేక్ చేసినా మన సెన్సిబిలిటీస్ ప్రకారం చేశాం. ఎక్స్‌‌పెరిమెంటల్ మూవీ అని చెప్పవచ్చు. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్’ అన్నారు. రమేష్‌‌వర్మ, మల్టీడైమెన్షన్ వాసు కూడా పాల్గొన్నారు.

Latest Updates