రకుల్.. సో స్వీట్

కరోనా కారణంగా పనులు లేవు. సంపాదన లేదు. కడుపు నిండా తిండి కూడా దొరకని పరిస్థితుల్లో ఎంతోమంది అల్లాడుతున్నారు. ఇలాంటి వారిని ఆదుకోవడం కోసం సినీ పరిశ్రమలోని చాలామంది ముందుకొచ్చి విరాళాలు ప్రకటించారు. అయితే వారిలో దాదాపు అందరూ హీరోలు,
దర్శక నిర్మాతలే. ప్రణీత, లావణ్య త్రిపాఠి లాంటి అతి కొద్ది మంది తప్ప మిగతా హీరోయిన్లు మాత్రం ముందుకు రాలేదు. కోట్లు, లక్షల్లో రెమ్యునరేషన్లు తీసుకునే టాప్ హీరోయిన్లెవరూ స్పందించకపోవడం పట్ల పలువురు నెగిటివ్ కామెంట్లు కూడా చేశారు. అయితే కొందరు పైకి చెప్తా రు. కొందరు చెప్పకుండా చేస్తుం టారు. రకుల్ ప్రీత్ సింగ్ కూడా అదే చేసింది. రెండు వందల పేద కుటుంబాలకు రెండు పూటలా భోజనం పంపిస్తోంది. విషయం ఎలాగో బైటికి పొక్కింది. ‘నిజమేనా’ అని అడిగితే అవునంది. చాలా రోజులుగా ఈ పని చేస్తోందట.

లాక్‌ డౌన్ ముగిసేవరకు కూడా వాళ్లందరికీ భోజనం పెడతాను అంటోంది. ఇలారెండు పూటలా ఇంతమందికి భోజనం పెట్ట డానికి తక్కువ ఖర్చేమీ కాదు. ‘అయినా కూడా చేస్తా ను’ అని చెబుతోందంటే ఎంత మంచి మనసో అంటూ
అందరూ రకుల్‌నిమెచ్చుకుంటున్నారు. నిజమే. నలుగురి కడుపు నింపడం కంటే ఆనందం ఎందులో ఉంటుంది.
ఆమెని చూసి మిగతా నటీమణులు కూడా ముందుకొస్తా రేమో చూడాలి.

Latest Updates