నేను డ్రగ్స్ వాడలే.. జస్ట్ చాట్ చేశా

ముంబై: బాలీవుడ్ డ్రగ్స్ కేసులో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను ఎన్ సీబీ అధికారులు శుక్రవారం ముంబైలో ఇంటరాగేషన్ చేశారు. నాలుగు గంటల పాటు జరిగిన విచారణ సందర్భంగా రకుల్ ఇచ్చిన స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశారు.  తాను రియా చక్రవర్తితో డ్రగ్స్ గురించి చాట్ చేశానని రకుల్ అంగీకరించినట్లు తెలిసింది. అయితే తాను ఎలాంటి డ్రగ్స్ వాడలేదని ఆమె స్టేట్ మెంట్ ఇచ్చినట్లు సమాచారం. రకుల్ స్టేట్ మెంట్ ను అనలైజ్ చేసి, కోర్టు ముందు ఉంచుతామని ఎన్ సీబీ డైరెక్టర్ జనరల్ ముథా అశోక్ జైన్ వెల్లడించారు. ఇక ఎన్ సీబీ విచారణలో రకుల్ మరో నలుగురు సెలబ్రిటీల పేర్లను చెప్పినట్లు ‘టైమ్స్ నౌ’ చానెల్ తెలిపింది. డ్రగ్స్ అమ్మేవాళ్లు ఎవరితోనూ తనకు పరిచయం లేదని కూడా ఆమె స్పష్టం చేసినట్లు పేర్కొంది. ఈ కేసులో హీరోయిన్లు దీపికా పదుకోనె, సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్ శనివారం ఎన్ సీబీ విచారణకు హాజరు కానున్నారు.

ఆ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ దీపికనే..

దీపిక మేనేజర్ కరిష్మా ప్రకాశ్ కూడా శుక్రవారం ఎన్ సీబీ విచారణకు హాజరై స్టేట్ మెంట్ ఇచ్చారు. ఈ కేసులో ధర్మ ప్రొడక్షన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ క్షితిజ్ రవిని కూడా అధికారులు విచారించారు. డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరోయిన్లు, తదితరులు చాట్ చేసిన వాట్సాప్ గ్రూప్ కు దీపికా పదుకోనె అడ్మిన్ గా ఉన్నట్లు ఎన్ సీబీ వర్గాలు చెప్పాయని ‘టైమ్స్ నౌ’ తెలిపింది.

Latest Updates