మన్మథుడు 2: నాగార్జునతో రకుల్

rakul-romance-with-nagarjuna-in-manmadhudu-2

అక్కినేని నాగార్జున హీరోగా ‘మన్మధుడు 2’ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ ల పై అక్కినేని నాగార్జున, పి.కిరణ్ నిర్మాతలుగా ఉన్నారు.
సీనియర్ రైటర్ సత్యానంద్.. డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ కి స్క్రిప్ట్ ని అందించగా, అమల అక్కినేని ఫస్ట్ క్లాప్ ఇచ్చారు. నాగ చైతన్య కెమెరా స్విచ్ ఆన్ చేయగా మొదటి షాట్ ని దేవుని పటాలపై చిత్రీకరించారు.  ఈ కార్యక్రమంలో.. సుమంత్, సుశాంత్, నాగ సుశీల, యార్లగడ్డ సురేంద్ర పాల్గొన్నారు. అక్కినేని నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తోంది.రకుల్ ఇదివరకే.. నాగ చైతన్యతో కలిసి రకుల్ ప్రీత్ సింగ్ ‘రారండోయ్ వేడుక చూద్దాం’ అనే సినిమాలో కలిసి నటించడా.. ఇప్పుడు నాగార్జున తో జతకడుతుంది. వారం రోజులు హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకున్న తర్వాత పోర్చుగల్ వెళ్లనుంది చిత్ర యునిట్.

చిత్ర దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ, ” చి || ల || సౌ చిత్రాన్ని నాగార్జున గారు చూసి మెచ్చుకుని అన్నపూర్ణ బ్యానర్ లో రిలీజ్ చేశారు. ఆ చిత్రాన్ని చూసినప్పుడే ఆయన నాతో సినిమా చేస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం నాకు ఈ చిత్రాన్ని చేసే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు.” అన్నారు. ‘మన్మధుడు 2’  లో లక్ష్మి, వెన్నెల కిషోర్, రావు రమేష్, నాజర్, ఝాన్సీ, దేవదర్శిని నటిస్తున్నారు.

స్క్రీన్ ప్లే : రాహుల్ రవీంద్రన్, సత్యానంద్,
డైలాగ్స్ : కిట్టు విస్సప్రగడ, రాహుల్ రవీంద్రన్,
ఎడిటర్స్ : చోట వి ప్రసాద్, బి.నాగేశ్వర రెడ్డి,
ప్రొడక్షన్ డిజైనర్స్ : ఎస్. రామకృష్ణ, మోనికా నీగోత్రే సబ్బని,
కాస్ట్యూమ్స్ : అనిరుధ్ సింగ్, దీపికా లల్వాని,
డి.ఓ.పి : ఎం.సుకుమార్,
సంగీతం : చైతన్ భరద్వాజ్
నిర్మాతలు : అక్కినేని నాగార్జున, పి.కిరణ్,
దర్శకత్వం : రాహుల్ రవీంద్రన్

Latest Updates