హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటిలో CAAపై ర్యాలీలు

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. CAAపై విద్యార్థి సంఘాలు పోటాపోటీ ర్యాలీలు నిర్వహించాయి. సీఏఏకి మద్దతుగా ఏబీవీపీ విద్యార్థులు ర్యాలీ చేశారు. మరోవైపు సీఏఏను వ్యతిరేకిస్తూ లెఫ్ట్ అనుకూల విద్యార్థి సంఘాలు ర్యాలీ నిర్వహించాయి.  దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు భారీగా మోహరించారు.