యంగ్ డైరెక్టర్‌‌తో రాంచరణ్ నెక్స్ట్‌‌ మూవీ?

హైదరాబాద్: కరోనా కారణంగా సినిమా షూటింగ్స్‌ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. షూటింగ్స్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ బడా ఫిల్మ్స్‌ షూట్ స్టార్ట్‌కు కొంత టైమ్ తీసుకుంటున్నాయి. కరోనా వ్యాప్తి ఎక్కువవడంతో మూవీ మేకర్స్‌ వెనకడుగు వేస్తున్నారు. టాలీవుడ్ మోస్ట్‌ అవేటెడ్ మూవీ ఆర్ఆర్‌‌ఆర్ షూటింగ్ కూడా ఆగిపోయింది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వెయిట్ చేస్తున్నాడు. ఈ మూవీ పూర్తి కాకముందే చరణ్​ నెక్స్ట్ మూవీపై క్లారిటీ వచ్చింది. యంగ్ డైరెక్టర్‌, భీష్మ ఫేమ్‌ వెంకీ కుడుములతో మగధీరుడు నటిస్తాడని తెలిసింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నారని తెలుస్తోంది. ఫిల్మ్‌ నగర్ సమాచారం ప్రకారం.. ఈమధ్యే చరణ్‌కు వెంకీ స్క్రిప్ట్‌ వినిపించారని, మూవీలో తన క్యారెక్టర్‌‌ మెగా పవర్‌‌ స్టార్‌‌కు బాగా నచ్చిందని తెలిసింది. ఆర్‌‌ఆర్‌‌ఆర్ షూటింగ్ కంప్లీట్ అయ్యాక చరణ్ ఈ సినిమా మొదలుపెడతాడని టీటౌన్ టాక్. అయితే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య మూవీలో కీలక రోల్‌లో కనిపించనున్న చరణ్.. ఫస్ట్‌ ఆ సినిమా షూటింగ్ పూర్తి చేశాకే వెంకీతో మూవీలో జాయిన్ అవుతాడని సమాచారం.

వెంకీ కుడుముల, చరణ్ కాంబినేషన్‌లో ఏడాది నుంచి సినిమా చేయాలనే యత్నాలు సాగుతున్నప్పటికీ అదిప్పుడు కార్యరూపం దాల్చిందని సినీ వర్గాలు అంటున్నాయి. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌‌టైనర్‌‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో పలు ఇతర భాషా నటీనటులు యాక్ట్‌ చేయనున్నట్లు సమాచారం. అక్టోబర్‌‌లో ఈ మూవీ పట్టాలెక్కనుందని తెలిసింది. పరిస్థితులు సద్దుమణిగాక దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేయాలని మేకర్స్‌ ఆలోచిస్తున్నారని సమాచారం.

Latest Updates