ఇద్దరి దారులు వేరైనా కలిసేది ధర్మం కోసమే..

ఇద్దరి దారులు వేరైనా కలిసేది ధర్మం కోసమే..

‘ఆర్ఆర్ఆర్​’ సినిమా ఇంకా థియేటర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి వెళ్లకుండానే ‘ఆచార్య’తో ప్రేక్షకుల ముందుకు కొస్తున్నాడు రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  చరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. చిరంజీవి హీరోగా కొరటాల శివ రూపొందించిన ఈ చిత్రంలో సిద్ధ అనే కీలక పాత్రను చరణ్ పోషించాడు. ఈనెల 29న సినిమా విడులవుతున్న సందర్భంగా ఇలా ముచ్చటించాడు. 
    
‘లాంచింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమయానికి ‘ఆచార్య’లో నా పాత్ర లేదు. నేను నిర్మాతగా ఈ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి ఎంటరయ్యాను తప్ప నా క్యారెక్టర్ ఉంటుందని అస్సలు ఊహించలేదు. కానీ తర్వాత స్క్రిప్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పదిహేను నిముషాల క్యామియో రోల్ యాడ్​ చేశారు శివ. ఆ తర్వాత అది నలభై నిముషాలకు పెరిగింది. సెకెండాఫ్ అంతా కనిపిస్తాను. పదిహేను నిముషాల పాత్రకే ‘ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ సెట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి రాజమౌళి వెళ్లనిస్తారా అనుకున్నా. కానీ అనుమతించారు. అందుకు రాజమౌళికి థ్యాంక్స్’ అని రామ్ చరణ్ అన్నాడు.

‘మిర్చి టైమ్ నుంచి శివ గారితో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నాం. కానీ మాకున్న కమిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కుదరలేదు. ఇప్పటికి వీలు పడింది. ఆయన తొంభై శాతం హోమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్క్ చేస్తే, ఆ పాత్రలను అర్థం చేసుకోవడంలో మేము పది శాతం ఎఫర్ట్ పెట్టాం. డైరెక్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి హండ్రెడ్ పర్సెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సరెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయితేనే సరికొత్తగా కనిపిస్తామని నేను నమ్ముతాను. ఆచార్య, సిద్ధ పాత్రలు పూర్తి డిఫరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంటాయి. నేను గురుకులం స్టూడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటించాను. అహింసని నమ్ముతాను. నాన్నది కంప్లీట్ ఫైటర్ రోల్. ఇద్దరి దారులు వేరైనా కలిసేది ధర్మం కోసం. ఈ రెండు పాత్రల్నీ ఏ ఇద్దరు హీరోలు చేసినా సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హిట్టే. మా ఇద్దరి రియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిలేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ బోనస్ మాత్రమే’ అని చరణ్​ చెప్పుకొచ్చాడు.  

‘ప్యాన్ ఇండియా రిలీజ్ అనేది ముందుగా అనుకోలేదు. ‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాత ఆ ఆలోచన వచ్చినా ఇప్పుడు టైమ్ లేదు. ఇతర భాషల్లోనూ నేనే డబ్బింగ్ చెప్పాలనేది నా కోరిక. అందుకే కొంత టైమ్ తీసుకుని కొద్ది నెలల తర్వాత రిలీజ్ చేస్తాం. రెండు నెలల్లో రెండు సినిమాలు (ఆర్ఆర్ఆర్, ఆచార్య)  రావాలని అనుకోలేదు. అలా సెట్టయ్యింది. అయినా ఇది నాన్న సినిమా. నేనొక పాత్ర చేశానంతే. ఈ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని సెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడంలో నా పాత్ర ఉంది తప్ప ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంతా నిరంజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి చూసుకున్నారు. శివ టీమ్ కూడా. వీళ్లంతా ఉండబట్టే నేను ప్రశాంతంగా ‘ఆర్ఆర్ఆర్’ చేసుకున్నాను. ‘సైరా’ తర్వాత ఈ సినిమాని మా ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే చేయాలనుకున్నా. కానీ ‘ఆర్ఆర్ఆర్’ వల్ల నేను ఒక్కడినే చేయలేని పరిస్థితి కనిపించింది. నాన్న, నేను ఈ సినిమాకి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చేశాం. ఓన్ ప్రొడక్షన్ కాకపోతే ఎందుకు చేస్తాం! లేదంటే కొవిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆ భారం కచ్చితంగా సినిమాపై పడేది’ అని చరణ్ పేర్కొన్నాడు.