మెగా అభిమాని మృతి.. రూ.10 లక్షలు సాయం అందించిన చరణ్

హీరో రామ్ చరణ్ రియల్ హీరో అనిపించుకున్నాడు. గుండె పోటుతో మరణించిన మెగా అభిమాని కుటుంబానికి రూ.10 లక్షలు సాయం అందించారు. మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ హైదరాబాద్ ప్రెసిడెంట్ నూర్ అహ్మద్(55) ఆదివారం గుండె పోటుతో మరణించాడు. విషయం తెలిసిన వెంటనే రామ్ చరణ్ నూర్ అహ్మద్ ఫ్యామిలీకి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

తనవంతు సాయంగా పది లక్షలు అందిస్తున్నట్లు ప్రకటించాడు. షూటింగ్ సందర్భంగా బిజీగా ఉన్నానని..హైదరాబాద్ రాగానే మృతుడి కుటుంబాన్ని కలుస్తానని తెలిపాడు చరణ్.  మరణవార్త తెలియగానే ఆదివారం చిరంజీవి, అల్లు అర్జున్, అల్లు అరవింద్ నూర్ ఇంటికి వెళ్లి ఫ్యామిలీ సభ్యులను పరామర్శించారు.

Latest Updates