అనురాగ్ కశ్యప్ మంచోడు.. ఎవర్నీ హర్ట్ చేయడం చూడలే

న్యూఢిల్లీ: బాలీవుడ్ పాపులర్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్‌‌పై మీటూ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. తెలుగులో ప్రయాణం మూవీలో నటించిన పాయల్ ఘోష్ అనురాగ్‌‌ కశ్యప్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని పేర్కొంది. పాయల్ ఘోష్‌‌కు కంగనా రనౌత్ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అనురాగ్‌‌ కశ్యప్‌‌కు వివాదాస్పద ఫిల్మ్ మేకర్ రామ్ గోపాల్ వర్మ సపోర్ట్‌‌గా నిలిచాడు. అనురాగ్ చాలా సున్నితమైన వ్యక్తి అని, అతడు చాలా ఎమోషనల్ అని ఆర్జీవీ చెప్పాడు. అనురాగ్ ఇతరులను హర్ట్ చేసినట్లు తన దృష్టికి ఎప్పుడూ రాలేదన్నాడు.

‘అనురాగ్ కశ్యప్ చాలా సున్నితమైన, భావోద్వేగాలు కలిగిన వ్యక్తి. గత ఇరవై ఏళ్ల మా పరిచయంలో తను ఇతరులను బాధ పెట్టడం నేనెప్పుడూ చూడలేదు, వినలేదు. కాబట్టి అసలేం జరుగుతుందనేది నేను అంచనా వేయలేను’ అని ఆర్జీవీ ట్వీట్ చేశాడు. అనురాగ్ కశ్యప్‌‌కు ఆర్జీవీతోపాటు ఆయన మాజీ భార్యలు కల్కీ కొచ్లిన్ కూడా మద్దతు తెలిపారు. ‘నీ సినిమా స్క్రిప్టుల్లో మహిళా స్వేచ్ఛ కోసం పోరాడావు. ఈ సోషల్ మీడియా సర్కార్‌‌ను కొనసాగనివ్వొద్ద’ని కల్కి కొచ్లిన్ పేర్కొంది.

Latest Updates