ఇస్మార్ట్ శంక‌ర్ కోసం వర్మ ట్రిపుల్‌ రైడింగ్‌

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఏం చేసిన అది సంచ‌ల‌న‌మే. ఆయన సినిమాల‌తోనే కాదు చేసే ప‌నుల‌తోను వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటాడు.  త‌న శిష్యుడు పూరీ జ‌గ‌న్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాను ప్ర‌మోట్ చేసే ప‌నిలో బిజీగా ఉన్న వ‌ర్మ ఇప్పుడు.. ఆ స‌క్సెస్‌ని కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. 2015లో వ‌చ్చిన టెంప‌ర్ చిత్రం త‌ర్వాత పూరీ ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంతో ఘ‌న విజ‌యం సాధించాడు. దీంతో టీంతో క‌లిసి వ‌రుస సెల‌బ్రేష‌న్స్ జ‌రుపుకుంటున్నాడు.

ప్రమోషన్స్ లో భాగంగానే RX 100 డైరెక్టర్ అజయ్‌ భూపతి, లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ డైరెక్టర్‌ అగస్త్య మంజు, తాను బైక్‌పై ట్రిపుల్‌ రైడింగ్‌ చేస్తూ.. హెల్మెట్‌ కూడా లేకుండా సినిమాను చూడటానికి వెళ్తున్నానని ట్వీట్‌ చేస్తూ.. ఫోటోను షేర్‌ చేశాడు వర్మ. ఫోటోను నెటిజన్లు కామెంట్లతో ఓ ఆట ఆడేసుకున్నారు. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులకు వర్మ చాలెంజ్‌ విసిరాడని, మూడు ట్రాఫిక్‌ రూల్స్ బ్రేక్ చేశాడని.. నో హెల్మెట్‌, త్రిబుల్‌ రైడిండ్‌, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రామ్ హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ పక్కా మాస్ సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Latest Updates