‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకు ప్రధాని మోడీ ప్రచారం: వర్మ

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు ప్రధాని మోడీ ప్రచారం చేశారని సీనీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. ఇందుకు ట్విటర్ వేదికగా ఓ వీడియోను పోస్ట్ చేసి కామెంట్ చేశారు వర్మ. తాను ఎన్టీఆర్ జీవితంలో ఎవరికీ తెలియని కోణాలను చూపించడానికి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తెరకెక్కిస్తున్నానని అందుకు సరిపోయేలా మోడీ మాటలు ఉన్నాయని తెలిపారు.

ప్రధాని మోడీ ఈ రోజు ఆంద్ర ప్రదేశ్ లోని గుంటూరు లో పర్యటించారు. సభలో మాట్లాడిన మోడీ ఏపీ సీఎం చంద్రబాబుపై తనదైన విమర్శలు చేశారు. చంద్రబాబు మోసం చేయడంలో నెంబర్ వన్ అని.. మామ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబుదని అన్నారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ పార్టీ పెట్టి పోరాడితే.. ఇప్పుడు చంద్రబాబు.. అదే కాంగ్రెస్ ఒడిలో కూర్చున్నారని ఎద్దేవా చేశారు. ఈ వీడియోను ట్విటర్ లో పోస్ట్ చేసిన వర్మ తనదైన కామెంట్ చేశారు.

Latest Updates