ఇది చట్టం విజయమని ప్రకటించిన వైద్యనాథన్

ఈ రోజు భారతదేశ చరిత్రలో నిలిచిపోయే గొప్ప రోజు అని అయోధ్య కేసులో రామ్ లల్లా తరఫున వాదించిన లాయర్ సీఎస్ వైద్యనాథన్ అన్నారు. ఈ కేసులో విజయం తనది కాదని, ఇది చట్టం సాధించిన విజయమని ఆయన చెప్పారు. అన్ని పక్షాలకూ న్యాయం చేసేలా సుప్రీం కోర్టు తీర్పునిచ్చిందని వైద్యనాథన్ అభిప్రాయపడ్డారు. దేశంలో ఐక్యతను కాపాడేలా, ప్రజల మధ్య సోదర భావం కొనసాగేలా ధర్మాసనం బ్యాలెన్స్‌గా వ్యవహరించిందన్నారు.

అయోధ్య కేసులో రామ్ లల్లా తరఫు లాయర్ సీఎస్ వైద్యనాథన్ వాదనలు కేసు విజయంలో కీ రోల్ పోషించాయి. రామ జన్మభూమిలో పూర్వం మందిరం ఉండేదని బలంగా వాదించడంతో పాటు అందుకు తగిన సాక్ష్యాలను కోర్టు ముందు ఉండడంలో సక్సెస్ అయ్యారు. 40 రోజుల వాదనల్లో ఏనాడూ పట్టుతప్పకుండా నిలబెట్టుకుంటూ వచ్చారాయన. ఎట్టకేలకు శనివారం సుప్రీం తీర్పు రామ్ లల్లాకు అనుకూలంగా వచ్చింది. వివాదాస్పద భూమి రామ మందిర నిర్మాణానికి ఇచ్చిన సుప్రీం కోర్టు.. సున్నీ వక్ఫ్ బోర్డుకు మరోచోట ఐదెకరాల భూమి ఇవ్వాలని తీర్పు చెప్పింది.

Latest Updates