రామ మందిర ట్రస్ట్‌ చీఫ్‌కు కరోనా పాజిటివ్

లక్నో: శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ హెడ్ మహంత్ నృత్య గోపాల్ దాస్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. గోపాల్‌ దాస్‌కు కరోనా పాజిటివ్‌గా తేలడం హాట్ టాపిక్‌గా మారింది. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి యోగి ఆదిత్యనాథ్ ఆరా తీశారు. ట్రీట్‌మెంట్‌కు సంబంధించిన మెడికల్ ఏర్పాట్లను దగ్గరుండి చూసుకోవాల్సిందిగా మేదాంత ఆస్పత్రిలోని డాక్టర్ ట్రెహాన్‌కు యోగి నిర్దేశించారని తెలిసింది.

అయోధ్యలో ఈ నెల 5న భూమి పూజ కార్యక్రమం వైభవంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీతోపాటు ఆర్‌‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తోపాటు మరికొందరు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ప్రోగ్రామ్‌లో గోపాల్ దాస్ కూడా పాల్గొన్నారు. భూమి పూజకు 175 మంది అతిథులకు దాస్ ఆహ్వానం పలికారు. భూమి పూజలో భారీ సెక్యూరిటీ ఏర్పాట్లను పక్కనబెడితే సోషల్ డిస్టెన్సింగ్, మాస్కులు కట్టుకోవడం లాంటి కరోనా ప్రోటోకాల్స్‌ను పాటించారు. ఈ కార్యక్రమం అనంతరం ప్రధాని మోడీ ప్రసంగిస్తున్న సమయంతోపాటు స్టాంప్ విడుదల చేస్తున్నప్పుడు కూడా ఆయన పక్కన గోపాల్ దాస్ ఉండటం గమనార్హం.

Latest Updates