అయోధ్య‌ రామ్ మందిరం ట్రస్టు లోగో రిలీజ్

  •  హనుమాన్ జయంతి సందర్భంగా
  •  ఆవిష్కరించిన ట్రస్ట్ జనరల్ సెక్రటరీ

అయోధ్య: రామ జన్మభూమి నిర్మాణం కోసం ఏర్పడిన శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అఫీషియల్ లోగోను ఆవిష్కరించింది. బుధవారం హనుమాన్ జయంతి సందర్భంగా లోగోను రిలీజ్ చేశారు. ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ లోగోను విడుదల చేశారు. చుట్టూ సూర్యుడు ప్రకాసిస్తుండగా.. మధ్యలో రాముడు ఉన్నట్లుగా  ఈ లోగోను రూపొందించారు. ఎరుపు, పసుపు, కాశాయ రంగులతో లోగోను డిజైన్ చేశారు. ‘ రామో విగ్రహావన్ ధర్మహ’ అని సంస్కృతంలో రాశారు. రాముడు, హనుమంతుడు మన దేశాన్ని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటారని రాయ్ అన్నారు.

Latest Updates