
తిరుమల: చిత్తూరు జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తాకు చేదు అనుభవం ఎదురైంది. భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దంపతులు మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విషయం తెలిసిందే. అయితే రాష్ర్టపతి ఆలయ ప్రవేశం చేస్తూన్న సమయంలో బయోమెట్రిక్ వద్ద చిత్తూరు జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ ని అడ్డుకున్నారు టీటీడీ విజిలెన్స్ అధికారులు. జిల్లా కలెక్టర్ ని అని చెప్పినా అనుమతించకపోవడంతో…. వెనక్కి తిరిగి వెళ్లిపోయారు కలేక్టర్ భరత్ గుప్త. రాష్ర్టపతి పర్యటనలో ప్రొటోకాల్ పర్యవేక్షణ అధికారినే అవమానించిన టిటిడి విజిలెన్స్ అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై టీటీడీ ఉన్నతాధికారులు వివరణ ఇవ్వాలన్నారు.