రామ్ స్టైల్లో రెడ్ టీజర్

కిషోర్‌ తిరుమల డైరెక్షన్ లో ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ హీరోగా నటిస్తున్న సినిమా రెడ్. రామ్‌ సరసన నివేదా పేతురాజ్‌, మాళవిక శర్మ, అమృతా అయ్యర్‌ హీరోయిన్లుగా నటిస్తున్న  ఈ మూవీ టీజర్ రిలీజైంది. నిమిషం 20 సెకన్లున్న ఈ టీజర్ ను మాస్ థ్రిల్లింగ్ గా చూపించారు. సిద్ధార్థ్‌, ఆదిత్య అనే రెండు విభిన్న పాత్రలో రామ్ కనిపించాడు. అందులో ఒకరు దొంగగా మరొకరు కాంట్రాక్టర్ గా అదరగొట్టాడు.

నేను శైలజ, ఉన్నది ఒక్కటే జిందగీ సినిమాల తర్వాత కిషోర్‌ తిరుమల-రామ్‌ కాంబినేషన్‌ లో వస్తోన్న మూడో మూవీ ఇదే కావడంతో సినిమాపై అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ కాంబోలో హైట్రిక్ హిట్ కన్ఫమ్ అంటున్నారు. శ్రీ స్రవంతి మూవీస్‌  బ్యానర్‌పై ‘స్రవంతి’ రవికిషోర్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 9వ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది యూనిట్. ఇస్మార్ట్‌ శంకర్‌ మాస్ హిట్ కావడంతో ‘రెడ్’ సినిమాపై కూడా రామ్ ఫ్యాన్స్ హై ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు.

Latest Updates