కరోనా ఎఫెక్ట్‌: అయోధ్య భూమి పూజకు అతిథులు సంఖ్య కుదింపు

  • 170 మంది మాత్రమే హాజరవుతారన్న ట్రస్టు
  • వీడియో ద్వారా హాజరు కానున్న అద్వానీ, జోషీ

అయోధ్య: కరోనా ప్రబలుతున్న వేళ అయోధ్య రామమందిరం నిర్మాణ శంకుస్థాపనకు పిలిచే అతిథుల సంఖ్య 200 నుంచి 170కి తగ్గించినట్లు తెలుస్తోంది. ఆగస్టు 5న ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. మాజీ డిప్యూటీ ప్రధాని ఎల్‌కే అద్వానీ, మాజీ కేంద్ర మంత్రి మురళీ మురళీ మనోహర్‌‌ జోషి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కార్యక్రమంలో పాల్గొననున్నారు. భూమి పూజ చేసే దగ్గర ప్రధాని మోడీతో పాటు ఆర్‌‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, రామ్‌జన్మభూమి న్యాస్‌ చీఫ్‌ నృత్య గోపాల్‌ దాస్‌లు మాత్రమే ఉంటారని ట్రస్ట్‌ సభ్యులు చెప్పారు. శ్రీశ్రీ రవిశంకర్‌‌, మోరారీ బాపూ, ఆచార్య నరేంద్ర గిరి, జగద్గురు స్వామి వాసుదేవనన్‌ సరస్వతి, స్వామి వాసుదేవనన్‌, సరస్వతిని కూడా భూమి పూజకు ఇన్వైట్‌ చేసినట్లు తెలుస్తోంది. 50 మంది సెయింట్స్‌ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మరో రెండు రోజుల్లో అయోధ్య భూమి పూజ జరగనుంది.

Latest Updates