సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసును సీబీఐ దర్యాప్తు చేయాలి

కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ డిమాండ్
న్యూఢిల్లీ: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకొని చనిపోయిన సంగతి తెలిసిందే. ఆయన మృతిపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ డిమాండ్ చేశారు. బిహార్–ముంబై పోలీసుల మధ్య జగడం నేపథ్యంలో సెంట్రల్ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్‌తోనే ఈ కేసులో న్యాయం జరుగుతుందన్నారు.

సుశాంత్ డెత్ కేసులో ముంబై పోలీసులు ఇప్పటివరకూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని పాశ్వాన్ తెలిపారు. సుశాంత్ తండ్రి కంప్లయింట్‌తో బిహార్ పోలీసులు కేసు నమోదు చేశారని.. కానీ ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదన్నారు. ‘ఇలాంటప్పుడు ఈ విషయంలో వారు న్యాయం ఎలా చేయగలరు. నటుడి కుటుంబానికి కేవలం సీబీఐ లాంటి సెంట్రల్ ఏజెన్సీనే జస్టిస్ చేయగలదు. ఎలాంటి జాప్యం లేకుండా కేసును సీబీఐకి అప్పగించాలి’ అని పాశ్వాన్ చెప్పారు. నాయకులందరూ ఈ విషయంలో మాట్లాడుతున్నందున సీబీఐకి కేసును అప్పగిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Latest Updates