వంద ఏండ్ల రామజన్మభూమి – బాబ్రీ మసీదు వివాదాలు..

దాదాపు 100 ఏండ్లకు పైగా నానుతూ వచ్చిన  రామజన్మ భూమి – బాబ్రీ మసీదు భూవివాదానికి నేటితో దాదాపు ఎండ్ కార్డ్ పడనుంది. అయోధ్య భూవివాదం కేసులో సుప్రీంకోర్టు  తీర్పు చెప్పనుంది. ఉదయం 10:30 గంటలకు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జిల రాజ్యాంగ బెంచ్ జడ్జిమెంట్ ను చెబుతుంది. ఈ కేసులో సుదీర్ఘంగా సాగిన విచారణను గత నెల 16 న ముగించిన బెంచ్, తీర్పును రిజర్వ్ చేసింది. సీజేఐ గొగోయ్ ఈనెల 17 న రిటైర్ కానుండటంతో ఆలోపే ఆయన విచారించిన కేసుల్లో తీర్పుచెప్పాల్సి ఉంది. తీర్పు రావడం ఖాయమే అయినా…. జడ్జిలు మాత్రం ఎవరూ ఊహించని విధంగా సెలవు రోజైన శనివారం కోర్టుకు వస్తున్నారు. కేవలం అయోధ్య తీర్పు చెప్పడానికే జడ్జిలు కోర్టుకు రానున్నారు.

1 రామమందిరం విషయంలో శతాబ్ద కాలంగా వివాదం నడుస్తోంది. రాముడి జన్మస్థలంలో.. నిర్మాణాలు, ఆలయాలు కూల్చేసి.. మసీదు నిర్మించారని పిటిషనర్లు అంటున్నారు. 1992.. డిసెంబర్ 6న కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చివేయడంతో వివాదం పెద్దదైంది. అయోధ్యలో రామజన్మభూమి, బాబ్రీ మసీదు ఒకేచోట ఉండటంతో ఈ స్థలాన్ని సందర్శించటానికి అనుమతి గురించి వివాదం మొదలైంది.

2.బాబ్రీ కూల్చివేత తర్వాత భూమి మీద హక్కు కోరుతూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.

3. వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని మూడు భాగాలుగా విభజించి, రాంలల్లా, నిర్మోహి అఖాడా, సున్నీ వక్ఫ్ బోర్డుకు పంచాలని 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది.

4.అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో మొత్తం14 పిటిషన్లు దాఖలయ్యాయి.

5.అక్టోబర్ 16న విచారణ ముగించిన సుప్రీం బెంచ్ ఇవాళ తుది తీర్పు చెప్పనుంది.

Latest Updates