హైదరాబాద్ లో కన్పించని రంజాన్ సందడి

కరోనా కారణంగా ఈ ఏడాది ఎక్కడా రంజాన్ వేడుకల కల కన్పించడంలేదు. ముఖ్యంగా రంజాన్ ఎంతో వేడుకగా జరిగే హైదరాబాద్ మహానగరంలో ఈ సంవత్సరం ఎలాంటి హడావుడీ లేకుండా కన్పిస్తోంది. నిత్యం కళకళలాడే హైదరాబాద్‌ చార్మినార్‌ ఏరియా రంజాన్‌ వచ్చిందంటే మరింత వెలుగులు నింపేది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ విధించింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో ఈసారి పాతబస్తీ కళ తప్పింది. అంతే గాకుండా రంజాన్‌ హలీం రుచి చూడకుండా ఉండని హైదరాబాదీలకు కరోనా ఎఫెక్ట్ తీవ్రంగా పడింది. రంజాన్‌ హలీంతో పాటు, ప్రత్యేక బిర్యానీలు లేకుండా పోయాయి. రంజాన్‌ నెలలో చార్మినార్‌ నుంచి మదీనా సర్కిల్‌ వరకు వచ్చిపోయే జనాలతో షాపులు రద్దీగా ఉండేవి. రోడ్డుకు రెండు వైపులా షాపులు, వాటి ముందు తోపుడు బండ్ల కొనుగోళ్లతో కిటకిటలాడేవి. డై ఫ్రూట్స్‌, ఫ్రూట్స్‌, మసాలా దినుసులు, సేమియా, కొత్త బట్టలు, అత్తర్లు, హౌస్‌ హోల్డింగ్స్‌ ఇలా అన్ని బిజినెస్‌లూ ఫుల్‌గా నడిచేవి. ప్రస్తుతం ఓల్డ్‌ సిటీలో ఆ సీన్‌ కనిపించడం లేదు. రోడ్లన్నీ ఖాళీగా కన్పిస్తున్నాయి.

రంజాన్ సమయంలో తోపుడు బండ్లు పెట్టే 50 వేల మందికి పైగా చిరువ్యాపారులు…ఆదాయం లేక… ప్రస్తుతం ఇల్లు గడవని పరిస్థితి ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Latest Updates