కాంగ్రెస్ కార్యకర్తలను కొట్టిన బసంత్ నగర్ SI

ఐదుగురు వ్యక్తులను దారుణంగా కొట్టిన బసంత్ నగర్ సబ్ ఇన్పెక్టర్ ను రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వాటర్స్ కు అటాచ్ చేశారు కమిషనర్ వి సత్యనారాయణ. వివరాల్లోకి వెలితే… పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలో MPTC గా గెలిచిన కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు విజయోత్సవర్యాలీ జరుపుకున్నారు.  ర్యాలీలో పఠాకులు పేల్చగా. అయితే అవి కాస్తా… స్థానిక టీఆర్ఎస్ నేత చింతల మురళి ఇంటిపై పడ్డాయి. దీంతో కావాలనే పఠాకులు వేశారని ఆయన కాంగ్రెస్ నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంప్లెంట్ ను తీసుకున్న స్థానిక SI ఉమాసాగర్ .. కాంగ్రెస్ కార్యకర్తలైన.. పొన్నవేని మహేష్ ,పొన్నవేని అనిల్ ,వడ్లకొండ అనిల్ ,గాలి శివ,జంగా సాగర్ లను దారుణంగా కొట్టాడు. వారు ప్రభుత్వ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.

తమను కొట్టిన SI పై పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు బాధితులు. దీంతో SI ఉమా సాగర్ ను రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వాటర్స్ కు అటాచ్ చేశారు కమిషనర్ వి సత్యనారాయణ. సంఘటన కి సంబందించిన పూర్తి విచారణ జరిపి ఎంక్వైరీ రిపోర్ట్ పంపవల్సిందిగా పెద్దపల్లి డిసిపి టి.సుదర్శన్ గౌడ్ కి సిపి ఆదేశాలు జారీ చేశారు.

Latest Updates