పోలీసుల అదుపులో 49మంది వడ్డీ వ్యాపారులు

రామగుండం కమిషనరేట్ పరిధిలో అక్రమ ఫైనాన్స్,చిట్స్, వడ్డీ వ్యాపారం చేస్తోన్న 49 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వాళ్ల దగ్గర నుంచి 65 లక్షల నగదు, ప్రామిసరీ నోట్లతో పాటు బాండ్ పేపర్లు, ATM కార్డులు స్వాధీనం చేసుకున్నారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పరిధిలో సింగరేణి కార్మికులు, చిరు వ్యాపారులు, కూలీలను టార్గెట్ గా అక్రమ వ్యాపారాలు జరిగాయని తెలిపారు సీపీ సత్యనారాయణ. తెలంగాణ ప్రభుత్వ యాక్ట్ కు, RBI నిబంధనలకు విరుద్ధంగా వడ్డీ వ్యాపారాలు చేస్తున్న వారిపై అవసరమైతే పిడి యాక్ట్ పెడతామని హెచ్చరించారు.

Latest Updates