నవ్వుల పాలైన రాష్ట్రపతి : హీరోయిన్ క్యారెక్టర్ ను గుర్తు చేసుకుంటున్న నెటిజన్లు

కరోనా వైరస్ పై నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్రపతి నవ్వుల పాలయ్యారు.

సౌతాఫ్రికాలో కరోనా వైరస్ పై మీడియా సమావేశం జరిగింది. ఆ సమావేశంలో మాట్లాడేందుకు ఆ దేశ రాష్ట్రపతి సిరిల్ రామా ఫోసా మీడియా ముందుకు వచ్చారు. ఆ సమయంలో జరిగిన ఓ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

మీడియాతో మాట్లాడే ముందుకు కరోనా వైరస్ నుంచి ప్రజలు ఎలా తమని తాము కాపాడుకోవాలి. మాస్క్ ఎలా ధరించాలి అని వివరించే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం విఫలమైంది.  మాస్క్ తో ముక్కు , నోటిని కవర్ చేసుకోవాల్సి ఉండగా కన్ఫ్యూజ్ అయ్యారు. నోటికి బదులు మొహం మొత్తం కనబడకుండా కవర్ చేసుకోవడం పై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బర్డ్ బాక్స్ సినిమాలోని సండ్రా బుల్ లాక్ క్యారెక్టర్ ను గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన నెట్టింట్లో వైరల్ అయ్యాయి.

సౌతాఫ్రికాలో కరోనా మరణాలు

సౌతాఫ్రికాలో ఇప్పటి వరకు 4,220మందికి కరోనా సోకింది. అందులో 1473మంది వైరస్ నుంచి కోలుకోగా..79మంది మరణించారు.

Latest Updates