రామప్ప పనులు త్వరగా పూర్తవ్వాలి : ఆర్కియాలజీ ఆదేశం

ములుగు, వెలుగు: రామప్ప సుందరీకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను స్టేట్ ఆర్కియాలజీ డైరెక్టర్ దినకర్‌ బాబు ఆదేశించారు. ఆలయానికి యునెస్కో గుర్తింపు కోసం రాష్ట్ర సర్కారు తీవ్రంగా కృషి చేస్తోందని చెప్పారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప రామలింగేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనులను గురువారం ఇన్‌టాక్ కన్వీనర్ పాండురంగారావు, కలెక్టర్​ సి.నారాయణరెడ్డి తదితరులతో కలిసి దినకర్‌ బాబు పరిశీలించారు.

కాకతీయుల కళా నైపుణ్యానికి ప్రతీకైన రామప్ప 15 రకాల విశిష్టతలను తనలో దాచుకుందని, ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపునకు ఆలయానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. యునెస్కో బృందం నుంచి హైకోమస్ సంస్థ ప్రతినిధులు ఈ నెల 25, 26 తేదీల్లో రామప్ప పరిశీలనకు వస్తారని చెప్పారు.

Latest Updates