రేపటి నుంచి మళ్లీ టీవీలో రామాయణం

టీవీ సీరియల్ రామాయణ్..మళ్లీ టీవీలో ప్రసారం కానుంది. రేపటి(శనివారం, మార్చి-28) నుంచి ప్రసారం కానున్నట్లు సమాచార ప్రసార శాఖా మంత్రి ప్రకాశ్ జావడేకర్ తెలిపారు. డీడీ నేషనల్‌ లో రోజూ రెండు ఎపిసోడ్‌లుగా ఉదయం 9-10 గంటలు, సాయంత్రం 9-10 గంటలకు రామాయణ్  ప్రసారం కానున్నట్లు చెప్పారు.

హిందీలో ప్రసారమైనా హిందీయేతర రాష్ట్రాల్లో కూడా ఎంతో ప్రజాభిమానం పొందిన టీవీ సీరియల్‌ ‘రామాయణ్‌’. 33 ఏళ్ల క్రితం రామానంద్‌ సాగర్‌ దర్శకత్వం వహించారు. ఈ పౌరాణిక సీరియల్‌, జనవరి 25, 1987 నుంచి జులై 31, 1988 వరకు ప్రతి ఆదివారం ఉదయం 10-10.35 ల మధ్య మొత్తం 85 వారాల పాటు ప్రసారమయ్యింది. అయితే అలాంటి అపురూపమైన సీరియల్ ను మళ్లీ ప్రసారం చేయాలంటూ చాలా మంది ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా కోరుతున్నారట. కరోనా, లాక్ డౌన్ తో ఇంట్లోనే ఉంటున్న తమకు చూసే అవకాశం కల్పించాల్సిందిగా ప్రజలు కోరారన్న మంత్రి… వారి కోరికతో రామాయణ్‌ను మళ్లీ ప్రసారం చేయనున్నట్టు తెలిపారు.

దీంతో పాటు మహభారత్ కూడా దూరదర్శన్ లో ప్రసారం చేస్తున్నట్లు చెప్పారు. ఈ సీరియల్ కూడా రోజుకు రెండు ఎపిసోడ్ లు గా మధ్యాహ్నం 12 గంటలకు, రాత్రి 7 గంటలకు ప్రసారం కానుంది.

Latest Updates