రామ్ చరణ్ కు గాయం.. RRR షూటింగ్ రద్దు

తెలుగు సినీ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గాయపడ్డారు. జిమ్ లో వర్కౌట్ చేస్తున్న సమయంలో… ఆయన మోకాలికి గాయమైంది. తగిలిన ఇంజూరీ చిన్నదే అని… అభిమానులు ఆందోళన పడవద్దని సన్నిహిత వర్గాలు మీడియాకు తెలిపాయి.

మంగళవారం నాడు జిమ్ లో కసరత్తు చేస్తున్న టైమ్ లో రామ్ చరణ్ గాయపడ్డారని RRR టీమ్ ఓ ప్రకటన విడుదలచేసింది. ఈ కారణంగా పుణె షెడ్యూల్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. మరో 3 వారాల్లో మళ్లీ తిరిగి షూటింగ్ ప్రారంభిస్తామని RRR టీమ్ తెలిపింది.

 

Latest Updates